త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు

  • విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న సుచిత్ర
  • ఆయన జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్య
  • త్రిష అంటే తనకు ఇష్టం ఉండదన్న సుచిత్ర

తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.


విజయ్ ప్రస్తుతం తన కుటుంబానికి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారని, ఈ ఒంటరితనాన్ని కొందరు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఒంటరిగా ఉంటున్న విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్రిష పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తున్న 'పరాన్నజీవుల' అనే వ్యాఖ్యలు పరోక్షంగా త్రిషను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు. విజయ్ పట్ల తనకు ఉన్న అభిమానం కొద్దీ ఈ విషయాలను నిష్పక్షపాతంగా చెబుతున్నానని అన్నారు. త్రిష అంటే తనకు ఇష్టం ఉండదని స్పష్టం చేశారు.

Trisha
Vijay
Suchitra
Tamil Nadu politics
Tamil Cinema
actress
singer
relationship rumors
political role
controversial comments

More Telugu News